- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మా పంటలు ఎండుతున్నాయి సార్.. మమ్మల్ని పట్టించుకోండి..'
by Manoj |
దిశ, స్టేషన్ ఘన్ పూర్ : సాగునీరు లేక యాసంగి పంటలు ఎండుతున్నాయని, సాగునీరు అందించి..latest telugu news

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్ : సాగునీరు లేక యాసంగి పంటలు ఎండుతున్నాయని, సాగునీరు అందించి ఆదుకోండని జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన రైతులు అధికారులను కోరుతున్నారు. రైతులు మాట్లాడుతూ గతంలో మల్లన్న గండి కుడి కాలువ ద్వారా వల్లభ రాయని చెరువు కింద పంటలు సాగు చేసుకున్నామన్నారు.
అయితే ఇటీవల కాలువ ఆధునీకరణ కోసం కాంట్రాక్టర్ పాత కాలువ మూసివేయడంతో చెరువు నిండక దాని కింద వేసుకున్న వరి, మొక్కజొన్న పంటలు ఎండు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఎండిపోతున్న పంటను కాపాడేందుకు సాగునీరు అందించాలని కోరారు. ఆ గ్రామానికి చెందిన మారపాక ఆనందం, ఐలయ్య, దేవయ్య, శోభ, రాజయ్య, బొంకురి యాదగిరి, అనంతపురం శంకర్ లతోపాటు పలువురు రైతులు శుక్రవారం ఎండిపోయిన భూమిని, పంటలను విలేకరులకు చూపించారు.
Next Story






