- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నదాత సుఖీభవపై విమర్శలు తగవు: సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలో వ్యవసాయం నిర్లక్ష్యం; 'అన్నదాత సుఖీభవ'పై విమర్శలు తగవు. ఏఐ టెక్నాలజీ, ఆక్వా హబ్, 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యమే లక్ష్యం - సీఎం చంద్రబాబు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో వ్యవసాయంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, తాము ప్రవేశపెట్టిన 'అన్నదాత సుఖీభవ' పథకం పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తిప్పికొట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం (YSRCP government rule)లో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, వారి ప్రజా వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని ముఖ్యమంత్రి విమర్శించారు. అప్పట్లో రైతులను పట్టించుకోని వారు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, గత బకాయిలను తీరుస్తూనే అన్నదాతకు అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అత్యాధునిక సాంకేతికతను (AI) జోడించబోతున్నట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. రైతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల సాగు ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రాయలసీమలో హార్టికల్చర్‌ను (ఉద్యానవన సాగు) పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, దేశంలోనే ఎక్కువ పండ్ల సాగు జరిగే రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందని సీఎం సభకు గుర్తు చేశారు. అలాగే ప్రకృతి సేద్యాన్ని రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాలకు విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం వ్యవసాయ యాంత్రీకరణను మరింత పెంచుతున్నామని వివరించారు.
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల (Food processing units) ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దీనివల్ల రైతులకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామని, అలాగే ఆక్వా సాగును కూడా మరింత ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికే 'ఆక్వా హబ్ గా మారుస్తామని, మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం ఉద్ఘాటించారు. రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించి ఆర్థికంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.






