ఫ్లైట్‌లో సిబ్బందికి తీవ్ర అస్వస్థత.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-17 04:50:05  IST  )

ఇంటర్నేషనల్ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన ఇవాళ ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

ఫ్లైట్‌లో సిబ్బందికి తీవ్ర అస్వస్థత.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నేషనల్ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన ఇవాళ ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్ (Bangkok) నుంచి నేరుగా జెడ్డా (Jeddah) వెళ్తున్న సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ (SV-845) విమానాన్ని వైద్య అత్యవసర కారణాల దృష్ట్యా పైలట్లు శంషాబాద్‌కు మళ్లించారు. విమానం గాలిలో ఉండగా, విమాన సిబ్బందిలో (Cabin Crew) ఒకరు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సదరు క్రూ సభ్యుడికి గుండెపోటు వచ్చినట్లుxe తెలుస్తోంది.

అయితే, పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే సమీపంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఏటీసీ (ATC) అధికారులను సంప్రదించగా.. వారు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతించారు. అనంతరం బాధితుడికి ఎయిర్‌పోర్టులోని వైద్య బృందం విమానంలోనే ప్రాథమిక చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో గ్రీన్ ఛానల్ ద్వారా అతడిని మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయ్యాక విమానం తిరిగి జెడ్డాకు బయలుదేరుతుందని సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Read More..

ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. తొమ్మిది దాటినా కనిపించని సూరీడు!

Next Story