- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
by Ratna Kumari |
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని దుందుభి నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని యజమానులపై కేసులు నమోదు చేశారు.

X
దిశ, ఉప్పునుంతల : నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని దుందుభి నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని యజమానులపై కేసులు నమోదు చేశారు. ఉప్పునుంతల ఎస్సై పుట్ట మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉల్పర గ్రామానికి చెందిన టీజీ-31టీ-3745 ట్రాక్టర్ యజమాని జిల్లెళ్ల వాసు, టీజీ-31టీఏ-5181 ట్రాక్టర్ యజమాని ముద్దమల్ల నాగేష్ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పుట్ట మహేష్ హెచ్చరించారు.
Next Story






