- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం
ప్రజలు పోలీసు సేవల పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నారనేదే పోలీసు శాఖ పనితీరుకు గీటురాయని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు.

దిశ, కోదాడ : ప్రజలు పోలీసు సేవల పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నారనేదే పోలీసు శాఖ పనితీరుకు గీటురాయని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్‌తో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం పోలీసు సిబ్బంది పనితీరు, స్టేషన్ నిర్వహణ, రికార్డులు, నేరాల నియంత్రణ చర్యలను సమీక్షించి పలు కీలక సూచనలు చేశారు.
పోలీస్ స్టేషన్‌ను పరిశుభ్రంగా నిర్వహించాలని, శిథిలావస్థకు చేరిన పాత పోలీస్ క్వార్టర్లను తొలగించేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి మెరుగైన వసతులతో కూడిన రిసెప్షన్‌లో సేవలు అందించాలని, అందిన ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులతో మర్యాదగా వ్యవహరించి పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని పేర్కొన్నారు. 2024, 2025, 2026 సంవత్సరాల్లో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై చేపడుతున్న పర్యవేక్షణను ఎస్పీ సమీక్షించారు. హిస్టరీషీటర్ల కదలికలను ప్రతి నెలా పరిశీలిస్తూ, అవసరమైతే బైండోవర్ చర్యలు, కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
కోదాడ పట్టణం, పరిసర ప్రాంతాల్లో గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. స్వల్ప పరిమాణంలో గంజాయి పట్టుబడినా కేసులు నమోదు చేయాలని, అవసరమైతే హిస్టరీషీట్లు తెరవాలని స్పష్టం చేశారు. అనుమానితులకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బైపాస్‌తో పాటు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణను మరింత పటిష్టం చేయాలని, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. మహిళలు, బాలికలు, వృద్ధులపై జరిగే నేరాల విషయంలో ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
స్టేషన్‌లో రికార్డులు, రిజిస్టర్లు, డిజిటల్ డేటా నిర్వహణను పరిశీలించిన ఎస్పీ.. ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు నవీకరిస్తూ సమర్థవంతమైన పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, పట్టణ సీఐ శివశంకర్, డీసీఆర్‌బీ సీఐ మగ్గం అలీ, ఎస్సైలు ఉపేందర్ రెడ్డి, సుధీర్ కుమార్, చిన్న మల్సూర్, ట్రాఫిక్ ఎస్సై బైరెడ్డి అంజిరెడ్డి, ఆర్‌ఎస్‌ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.






