- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి : సీపీఎం
రాష్ట్రంలో ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేయడమే కాకుండా, ఈ నెల 15న జరిగే ‘ఫీజు పోరు దీక్ష’కు సంపూర్ణ మద్ధతు ప్రకటించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సుమారు రూ. 7,500 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని గురువారం కలిసి, ఈ నెల 15న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ‘ఫీజు పోరు దీక్ష’కు మద్దతు కోరారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం నిర్వహించే ఈ దీక్షకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ, నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఉన్నత చదువులకు వెన్నెముకగా ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దురదృష్టకరమన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ పెండింగ్ వల్ల విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేయాల్సి రావడం అత్యంత బాధాకరమన్నారు.
కోర్సులు పూర్తి చేసినా బకాయిల సాకుతో విద్యా సంస్థలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు పైచదువులు, ఉద్యోగ అవకాశాలను కోల్పోయి, తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేసే ప్రభుత్వం, పేద విద్యార్థుల విద్యకు నిధులు కేటాయించకపోవడం శోచనీయమని అన్నారు. సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కనీస హక్కు అయిన ఫీజుల విషయంలో మొండివైఖరి ప్రదర్శించకుండా బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ స్కాలర్‌షిప్‌లను విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని, సర్టిఫికెట్లు ఆపేసిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.






