- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
50 వేల మందితో ఎర్రదండు మహా పాదయాత్ర
మహారాష్ట్రలో సీపీఐ(ఎం) పార్టీ భారీ మహా పాదయాత్రను ప్రారంభించింది.

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో సీపీఐ(ఎం) పార్టీ భారీ మహా పాదయాత్రను ప్రారంభించింది. పాల్ఘర్ జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ ఆఫీసుల నుంచి మొదలైన ఈ యాత్రలో సుమారు 50 వేల మంది రైతులు, కార్మికులు, ఆదివాసీలు, మహిళలు, యువత పాల్గొన్నారు. ఈ యాత్ర సోమవారం దహలోని చరోటి నుంచి మొదలై, మొదటి రోజు 35 కిలోమీటర్లు నడిచి మనోర్‌లో రాత్రి బస చేసి, రెండో రోజు మరో 25 కిలోమీటర్లు నడిచి పాల్ఘర్ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుంది. AIKS, CITU, AIDWA, SFI వంటి అనుబంధ సంఘాలు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో భాగస్వాములయ్యాయి. కాగా ఈ పాదయాత్రకు అశోక్ ధవలే, అజిత్ నవలే, వినోద్ నికోలే తదితర సీనియర్ నేతలు నాయకత్వం వహించారు.
MGNREGA పనిదినాలు, వేతనాలు పెంచడం, ఆదివాసీలకు భూమి హక్కులు ఇవ్వడం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ పూర్తిగా అమలు చేయడం, స్మార్ట్ మీటర్ స్కీమ్ రద్దు, లేబర్ కోడ్స్ రద్దు, PESA చట్టం అమలు వంటి డిమాండ్లతో ఈ ఉద్యమం సాగింది. ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేసారు. కాగా నేడు పాల్ఘర్ కలెక్టరేట్ వద్ద వీరంతా భారీ ధర్నా చేపట్టనున్నారు.






