నక్సలైట్లను చంపితే నక్సలిజం పోదు: సీపీఐ నారాయణ

by Gantepaka Srikanth |

కొంతమంది నక్సలైట్లను చంపితే పూర్తిగా నక్సలిజం అంతం అయిపోయినట్లు కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అన్నారు.

నక్సలైట్లను చంపితే నక్సలిజం పోదు: సీపీఐ నారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది నక్సలైట్లను చంపితే పూర్తిగా నక్సలిజం(Naxalism) అంతం అయిపోయినట్లు కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ(CPI Narayana) అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ ఉన్నాయి అని చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అలా కామెంట్ చేసే వారికి చరిత్ర తెలియదు అనుకుంటాం. స్వాతంత్ర పోరాటంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొదట నినాదం ఇచ్చిందే కమ్యూనిస్ట్ పార్టీ అని గుర్తుచేశారు. దున్నేవాడికి భూమి నినాదం కూడా మా వల్లే వచ్చిందని చెప్పారు. దేశం విడిపోకుండ అడ్డుకున్నది కమ్యూనిస్టులేనని, నా దేహం ముక్కలైనా.. ఈ దేశాన్నీ ముక్కలు కానివ్వమని ఎదురు నిలబడ్డామని చెప్పారు. అనంతరం సీపీఐ తెలంగాణ కార్యదర్శి, ఎమ్మెల్సీ కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) మాట్లాడుతూ.. తెలంగాణలోని ఖమ్మంలో 5 లక్షల మందితో సభ నిర్వహించబోతున్నామని చెప్పారు. సీపీఐ 100 ఏండ్ల ఉత్సవాల ప్రారంభ సభ కాన్పూర్‌లో జరిగిందని.. ముగింపు సభను తెలంగాణలో 5లక్షల మందితో ఈనెల 18న నిర్వహించబోతున్నామని అన్నారు. ఈ సభకు 40 దేశాల ప్రతినిధులు వస్తున్నారని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారని తెలిపారు.

Next Story