సీపీఐకి ఉన్న చరిత్ర మరే పార్టీకి లేదు: MLA కూనంనేని

by Gantepaka Srikanth |

సీపీఐ తెలంగాణ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

సీపీఐకి ఉన్న చరిత్ర మరే పార్టీకి లేదు: MLA కూనంనేని
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ తెలంగాణ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీఐ పార్టీకి ఉన్న చరిత్ర భారత దేశంలో మరే పార్టీకి లేదని అన్నారు. సీపీఐ, సీపీఐఎం పార్టీలు ఏకం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపై ఇరు పార్టీల నేతలు కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ కుంగిపోలేదని తెలిపారు. ఈ దేశంలో ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. సీపీఐ వందేండ్ల ఉత్సవాల ముగింపును ఘనంగా నిర్వహించనున్నామని కూనంనేని తెలిపారు. ఈనెల 18న ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కశాశాల గ్రౌండ్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి, వామపక్ష పార్టీ అగ్రనేతలతోపాటు సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. వామపక్షాలు ఎక్కడ ఉన్నాయి.. అనే వారికి ఖమ్మం బహిరంగ సభ సమాధానం కాబోతోందని ఇప్పటికే కూనంనేని ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story