- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా ముందు ప్రధాని మోడీ తలవంచారు: సీపీఐ నేత డి.రాజా
సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ(CPI) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న సీపీఐ కార్యదర్శి డి.రాజా(D.Raja) మాట్లాడుతూ.. భారత స్వాంతంత్ర్య ఉద్యమంలో సీపీఐ పార్టీ పాలు పంచుకుందని తెలిపారు. స్వాంతంత్ర్య సాధన కోసం సీపీఐ శ్రేణులు భారీగా పోరాటాలు చేశారని గుర్తుచేశారు. స్వాంతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదని అన్నారు. ఆంగ్లేయులతో ఆర్ఎస్ఎస్ చేతులు కలిపిందని కీలక వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాలో మారణహోమం జరుగుతోంది. పాలస్తీనాలో వేలమంది అమాయకులను ఊచకోత కోస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి పాలస్తీనాలో దారుణాలకు పాల్పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హిట్లర్‌లా మారిపోయాడు. నియంతలా మారి ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రధాని మోడీ అమెరికా ముందు తలవంచారు. భారత దేశ అభివృద్ధి కోసం మోడీ చేసింది ఏమీ లేదు. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఇంకా ఉన్నారు. ట్రంప్ దమ్ముంటే నా దేశంపై పెత్తనం చేయండి’ అని డి.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.






