కేటీఆర్‌ను ఒంటరిగానే విచారించాం.. CP సజ్జనార్ ప్రకటన

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ విచారణపై హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధికారిక ప్రకటన చేశారు.

కేటీఆర్‌ను ఒంటరిగానే విచారించాం.. CP సజ్జనార్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) విచారణపై హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ సజ్జనార్(CP Sajjanar) అధికారిక ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు, రికార్డులు కేటీఆర్ ముందు ఉంచి విచారించామని సజ్జనార్ తెలిపారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని అన్నారు. సాక్ష్యులు ఎవరినీ ప్రభావితం చేయొద్దని కేటీఆర్‌కు చెప్పినట్లు సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. బయట జరిగే ప్రచారానికి సిట్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసులో పారదర్శకంగా విచారణ కొనసాగుతోందని అన్నారు. ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సుమారు 7 గంటల పాటు సిట్ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారు. విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ విచారణపై ఘాటుగా స్పందించారు. ఈ విచారణను కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ఆడుతున్న ఒక "టైమ్ పాస్ ప్రోగ్రామ్" మరియు "టీవీ సీరియల్" అని కొట్టిపారేశారు.

Next Story