- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ పతంగుల జోరు.. ఇతరుల పాలిట యమపాశం కావొద్దు: సీపీ సజ్జనార్
సంక్రాంతి సందర్భంగా పిల్లలు పెద్దలు ఎంతో సంతోషంగా ఎగురవేసే పతంగులు.. ప్రజలు, పక్షులకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి సందర్భంగా పిల్లలు పెద్దలు ఎంతో సంతోషంగా ఎగురవేసే పతంగులు.. ప్రజలు, పక్షులకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చైనా మాంజా కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో చైనా మంజాలు ప్రజలకు తగిలి తీవ్రంగా గాయడపడుతున్నారు. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో నగర సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో " సంక్రాంతి అంటేనే సంబరం. ఏడాదికోసారి వచ్చే ఈ పండుగ నాడు ఆకాశమంత రంగురంగుల పతంగులు ఎగరేయడం మన ఆనవాయితీ.
కానీ, కొందరి నిర్లక్ష్యం వల్ల ఈ పండుగ పక్షులకు, వాహనదారులకు శాపంగా మారుతోంది. పండుగ పూట మీకున్న ఆనందం.. ఇతరుల ఇంట విషాదం నింపకూడదు. చైనా మాంజాపై సంపూర్ణ నిషేధం ఉంది. నైలాన్, గాజు పొడి అద్దిన సింథటిక్ దారాలను (చైనా మాంజా) అమ్మినా, కొన్నా, వాడినా చట్టం ఊరుకోదు. ఈ దారాలు పర్యావరణానికే కాదు.. పక్షుల పాలిట యమపాశంలా మారుతున్నయ్. రోడ్ల మీద పోయే బైకర్ల మెడకు మాంజా చుట్టుకొని గొంతు తెగిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. మీ సరదా అమాయకుల ప్రాణాలను బలిగొనకూడదు.
కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల కాడ పతంగులు ఎగరేయొద్దు. ఒకవేళ పతంగి కరెంట్ తీగల్లో ఇరుక్కుంటే.. ఇనుప రాడ్లతో గానీ, తడి చేతులతో గాని లాగడానికి ట్రై చేయకండి. కరెంట్ షాక్ కొట్టి ప్రాణాలకే ముప్పు రావొచ్చు. పిట్టగోడలు (Parapets) లేని డాబాల మీద చిన్నపిల్లలను ఒంటరిగా పతంగులు ఎగరేయనివ్వొద్దు. పతంగి ధ్యాసలో పడి పిల్లలు కింద పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి. చైనా మాంజా అమ్మేటోళ్లపై, వాడేటోళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినం. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు బుక్ చేస్తాం. కేవలం కాటన్ దారాలను మాత్రమే వాడండి. మూగజీవాలను, మనుషుల ప్రాణాలను కాపాడండి. సేఫ్‌గా సంక్రాంతి పండుగ చేసుకోండి అంటూ సీపీ సజ్జనార్ తన ట్వీట్ ద్వారా నగర, రాష్ట్ర ప్రజలకు అలర్ట్ జారీ చేశారు.






