అఫ్జల్‌గంజ్ దినేష్ సాహసానికి సీపీ సజ్జనార్ ఫిదా.. గణతంత్ర వేడుకల్లో సత్కారం

by Malleboina Mahesh |

హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. అందులో నాంపల్లి పర్నీచర్ షాప్ ప్రమాద సమయంలో దైర్యసహాసం చేసిన అఫ్జల్‌గంజ్ దినేష్ సాహసాన్ని ప్రశంసించారు.

అఫ్జల్‌గంజ్ దినేష్ సాహసానికి సీపీ సజ్జనార్ ఫిదా.. గణతంత్ర వేడుకల్లో సత్కారం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. అందులో నాంపల్లి పర్నీచర్ షాప్ అగ్ని ప్రమాద సమయంలో దైర్యసహాసం చేసిన అఫ్జల్‌గంజ్ దినేష్ (Afzalganj Dinesh) సాహసాన్ని ప్రశంసించారు. సీపీ తన ట్వీట్‌లో "నేటి యాంత్రిక జీవనంలో ఎక్కడైనా ప్రమాదం జరిగినా.. ఫోన్‌లో వీడియోలు తీస్తూ కాలక్షేపం చేసేవారే తప్ప, సాయం చేసే వారు కరువవుతున్నారని.. కానీ దినేష్ వంటి వారు మంచితనం ఇంకా బతికే ఉందని నిరూపించారని సీపీ సజ్జనార్ కొనియాడారు. రెండు రోజుల క్రితం నాంపల్లిలోని ఒక ఫర్నిచర్ షాప్ లో జరిగిన భారీ అగ్నిప్రమాద సమయంలో అఫ్జల్‌గంజ్‌కు చెందిన దినేష్ చూపిన తెగువ అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఒకపక్క భయంకరమైన మంటలు, మరోపక్క బాధితుల ఆక్రందనలు వినిపిస్తున్నా.. తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా మంటల్లోకి దూకి సహాయక చర్యల్లో పాల్గొన్న దినేష్‌ను సజ్జనార్ 'నిలువెత్తు మానవత్వం గా అభివర్ణించారు. ఈ సాహసోపేతమైన చర్యను గుర్తిస్తూ, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దినేష్‌ను సత్కరించడం పట్ల సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. "హ్యాట్సాఫ్ దినేష్" అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దినేష్ వంటి వ్యక్తులు ఈ సమాజానికి స్ఫూర్తిదాయకమని, క్లిష్ట సమయంలో వెనకడుగు వేయకుండా ప్రాణాలకు తెగించి సాయం చేసిన అతని ధైర్యం మరువలేనిదని ఈ సందర్భంగా నగర సీపీ సజ్జనార్ గుర్తు చేసుకున్నారు.

Next Story