- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆధారాలివ్వకుంటే క్రిమినల్ చర్యలు తప్పవు.. ఆర్ఎస్ పవీణ్‌కు సజ్జనార్ నోటీసులు
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సిట్ అధికారి సజ్జనార్ నోటీసులు పంపించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar)కు సిట్ అధికారి, సీపీ సజ్జనార్(CP Sajjanar) నోటీసులు పంపించారు. నాపై ఏడు కేసులు ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. రెండ్రోజుల్లో ఆధారాలు ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ ఏమన్నారంటే..?
కాగా, శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఒక పోలీస్ అధికారిగా ఫోన్ ట్యాపింగ్ విషయం తనకు తెలుసని.. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఈ అంశాన్ని.. రేవంత్‌రెడ్డి బజారున పడేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధించేందుకు అక్రమ సిట్‌ను ఏర్పాటు చేశారన్నారు. సజ్జనార్ సిట్ అధికారిగా ఉన్నారని.. ఆయనపై ఏడు కేసులు ఉన్నాయని.. ఆయన సిట్ చీఫ్‌గా ఉండడం ఏందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)ను విచారించే నైతిక హక్కు సజ్జనార్, శివధర్‌రెడ్డి ఇద్దరికీ లేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. దీంతో తాజాగా స్పందించిన సజ్జనార్ తనపై ఉన్న ఏడు కేసుల వివరాలు ఇవ్వాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు నోటీసులు ఇచ్చారు.






