- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్లుపేట ప్రమాదంపై సీపీ సాయి చైతన్య సమీక్ష
మల్లుపేట చౌరస్తా వద్దజరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని కామారెడ్డి ఇన్‌చార్జి ఎస్పీ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సందర్శించి పరిశీలించారు.

దిశ, సదాశివనగర్: సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లుపేట చౌరస్తా వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని కామారెడ్డి ఇన్‌చార్జి ఎస్పీ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సందర్శించి పరిశీలించారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ-300 కారు అదుపుతప్పి, ఎదురుగా కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న హ్యుందాయ్ ఆరా కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న పలువురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాద స్థలం వద్దుగా వెళ్తున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రమాదాన్ని గమనించి వెంటనే ఆగి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించి, వారికి అవసరమైన వైద్య చికిత్స అందేలా పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో, పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే స్పందించి ప్రమాదానికి గురైన వాహనాలను రహదారి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను సజావుగా పునరుద్ధరించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న ఎస్సై పుష్పరాజ్‌తో పాటు పోలీసు సిబ్బంది చూపిన చొరవను పోలీస్ కమిషనర్ అభినందించారు.






