- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: గాదె ఇన్నయ్యకు బెయిల్ మంజూరు
మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నారనే కారణంతో కొన్ని నెలల క్రితం సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party) భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నారనే కారణంతో ఇటీవల సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య(Gade Innaiah)ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో గాదె ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అయితే.. తాజాగా గాదె ఇన్నయ్య ఇంట్లో విషాదం నెలకొంది. ఇన్నయ్య తల్లి థెరిసమ్మ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వయోభారంతో ఇబ్బంది పడుతున్న ఆమె గురువారం రాత్రి జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సాగరంలోని సొంతింట్లో తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం. కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించడంతో ఇన్నయ్యకు బెయిల్ దొరికింది. అంత్యక్రియల కోసం కోర్టు 48 గంటల బెయిల్ మంజూరు చేసింది. కాసేపట్లో విడుదల కానుండటంతో కుటుంబ సభ్యులంతా చంచల్‌గూడ జైలు ఎదుట వేచి చూస్తున్నారు.






