బ్రేకప్ తర్వాత ఎక్స్ లవర్‌తో వెకేషన్ ట్రిప్.. కండిషన్స్ అప్లై!

by Dishafeatures2 |
బ్రేకప్ తర్వాత ఎక్స్ లవర్‌తో వెకేషన్ ట్రిప్.. కండిషన్స్ అప్లై!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా బ్రేకప్ తర్వాత ఏ జంటయినా సరే.. ఒకరికొకరు ఎదురుపడేందుకు ఇష్టపడరు. ఒకవేళ ఎక్కడైనా తారసపడ్డా ముఖం తిప్పుకుని వెళ్లిపోతారు. అలాంటి ఓ జంట తప్పని పరిస్థితుల్లో కలిసి వెకేషన్‌కు వెళ్లాల్సి వస్తే? ఒకే రూమ్‌ షేర్ చేసుకోవాల్సి వస్తే? ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఓ విదేశీ జంట అచ్చం ఇలాంటి సిచ్యువేషన్‌నే ఫేస్ చేయాల్సి వచ్చింది. బ్రేకప్‌కు ముందే ప్లాన్ చేసుకున్న టూర్‌కు బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది. మరి అక్కడ ఏం జరిగిందో తెలుసా?

పైన తెలిపిన కపుల్.. రెండు నెలల కిందట డీప్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు డొమినికన్ రిపబ్లిక్‌ ట్రిప్‌కు బుక్ చేసుకున్నారు. అయితే టూర్‌కు వెళ్లకముందే అభిప్రాయాల భేదాలతో విడిపోవడంతో టూర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని రీఫండ్ పొందాలనుకున్నారు. కానీ తమ బ్రేకప్‌ను ముందే ఊహించలేకపోయిన జంట.. బుకింగ్‌పై ఎటువంటి ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. దీంతో రీఫండ్ పొందే అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో.. కష్టమైనా సరే కలిసి ట్రిప్ వెళ్లడం కన్నా మరో మార్గం కనిపించలేదు.

ఈ నేపథ్యంలో ఎక్స్ లవర్‌తో డొమినికన్ రిపబ్లిక్‌ పర్యటనకు వెళ్లిన టిక్‌టాకర్ లిడియా బర్డ్.. 'మాజీ పార్ట్‌నర్‌తో నాన్ రిఫండబుల్ బ్రేకప్ ట్రిప్' క్యాప్షన్‌తో టూర్ వీడియోలను పంచుకుంది. అంతేకాదు 'జీవితం ఎప్పుడైనా బోరింగ్‌గా అనిపిస్తే.. ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో ఉష్ణమండల విహారయాత్రకు వెళ్లండి' అని చమత్కరించింది. మరోవైపు హోటల్ స్టాఫ్ వీరికి డబుల్ రూమ్‌కు బదులు సింగిల్ రూమ్‌ను కేటాయించి సిచ్యువేషన్‌ను మరింత వేడెక్కించింది. ఇది గమనించిన నెటిజన్లు ఇద్దరి మధ్య మరోసారి ప్రేమ పుట్టడం ఖాయమని కామెంట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed