నడిరోడ్డు మీద వికలాంగుడిపై కర్రలతో దాడి చేసిన దంపతులు... వీడియో వైరల్

by S Gopi |   (  Updated:2022-03-29 08:57:07  IST  )

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడాలో..Couple Assaults Disabled Man On Scooter Near Delhi

నడిరోడ్డు మీద వికలాంగుడిపై కర్రలతో దాడి చేసిన దంపతులు... వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడాలో దంపతులు ఓ వికలాంగుడి పట్ల దారుణంగా ప్రవర్తించారు. కర్రలతో అతడిపై, అతడి బండిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జెవార్ ప్రాంతానికి చెందిన వికలాంగుడు బైక్ పై వెళ్తుండగా అతని బంధువులైనటువంటి ఇద్దరు దంపతులు నడిరోడ్డుపై అడ్డగించి కర్రలతో దాడి చేశారు. దీంతో అతను విలవిలలాడిపోతూ, తనను తాను రక్షించుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వారి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు.

Source link

Next Story