- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌన్సిలర్ రూ.లక్ష, కార్పొరేటర్ రూ.1.50 లక్షలు: ఎన్నికల ఖర్చుపై ఈసీ కీలక ఆదేశాలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఖర్చు, నామినేషన్ ఫీజు వివరాలను వెల్లడించింది. మున్సిపాలిటీల్లో పోటిచేసే కౌన్సిలర్ అభ్యర్థికి రూ.లక్ష, మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్ అభ్యర్థికి రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేయడానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. దీంతో పాటు నామినేషన్ ఫీజు కూడా వెల్లడించింది. మున్సిపాలిటీల్లో పోటిచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1,250, జనరల్ అభ్యర్థులకు రూ.2,500 చెల్లించాలి. మున్సిపల్ కార్పొరేషన్‌లో పోటిచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500, జనరల్ అభ్యర్థులకు రూ.5వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు పోటీ చేసే అభ్యర్థి సంబంధిత వార్డులో ఓటరై ఉండాలి. ప్రపోజర్ కూడా ఓటరై ఉండాల్సిందే. మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో పాటు అభ్యర్థి నామినేషన్ పత్రాలను అభ్యర్థి/ప్రపోజర్ మాత్రమే అందజేయాల్సి ఉంటుందని, ఇతర వ్యక్తులు చేయడానికి లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఃఒక్కో అభ్యర్థి నాలుగు నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎన్ని వార్డుల్లో నామినేషన్ వేస్తే అన్ని డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థితో పాటు ముగ్గురు మాత్రమే ఆర్వో ఆఫీసులోకి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. దీంతోపాటు ఆర్వో ఆఫీసుకు 100 మీటర్ల దూరంలో రెండు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనలు, సలహాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు చెబుతున్నారు.






