- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డ కౌన్సిలర్, అత్యాచారయత్నం
వృద్ధురాలి ఇంట్లోకి నగ్నంగా చొరబడి అత్యాచారయత్నం చేసిన స్టేషన్ ఘన్‌పూర్ కౌన్సిలర్ సంపత్ రాజ్.. బాత్రూమ్‌లో బంధించి పోలీసులకు అప్పగించిన జనం!

దిశ, వెబ్ డెస్క్: ప్రజాప్రతినిధి హోదాలో ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక కౌన్సిలర్ అర్ధరాత్రి వేళ కామంధుడిలా మారి అత్యంత నీచమైన చర్యకు ఒడిగట్టాడు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్లు గ్రామంలో (మున్సిపాలిటీ పరిధిలో) ఈ ఘోర ఉదంతం వెలుగుచూసింది. వార్డు కౌన్సిలర్ అర్ధరాత్రి వేళ ఒక వృద్ధురాలి ఇంట్లోకి నగ్నంగా చొరబడటమే కాకుండా, ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
బాత్రూమ్‌లో బంధించి పోలీసులకు అప్పగింత..
బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ సంపత్ రాజ్ అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఒంటిపై నూలుపోగు లేకుండా (నగ్నంగా) స్థానికంగా ఉండే ఒక వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న ఆమెపై పడి అత్యాచారానికి ప్రయత్నించగా.. భయాందోళనకు గురైన ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. అందరినీ చూసి భయపడిన కౌన్సిలర్ సంపత్ రాజ్ నగ్నంగానే పక్కనే ఉన్న బాత్రూమ్‌లోకి పారిపోయి తలుపు పెట్టుకున్నాడు. వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించిన స్థానికులు బాత్రూమ్‌కు బయట వైపు గడియపెట్టి (తాళం వేసి) స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






