విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న కంగనా రనౌత్ సినిమా..

by Mallepaka Hamsa |

'క్వీన్ 2' చిత్రం ఇప్పుడు పెద్ద చట్టపరమైన చిక్కుల్లో పడింది.

విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న కంగనా రనౌత్ సినిమా..
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్వీన్-2’. ఈ సినిమా 2013లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్‌ ‘క్వీన్’కు సీక్వెల్‌గా రాబోతోంది. అయితే ‘క్వీన్’ సినిమా కంగనా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చిత్రాల్లో ఒక్కటి కావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు పెరిగాయి. ‘క్వీన్’ మూవీతోనే ఆమెకు నేషనల్ అవార్డ్ కూడా రావడం విశేషం. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన వికాస్ బహల్ ఈ సీక్వెల్‌ను కూడా తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ‘క్వీన్-2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, 'క్వీన్ 2' చిత్రం ఇప్పుడు పెద్ద చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కొన్ని రోజులకే, ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాంటమ్ స్టూడియోస్ .. జియోస్టార్ సంస్థపై ఏకంగా రూ. 250 కోట్ల భారీ నష్టపరిహారం కోరుతూ కోర్టులో దావా వేసినట్లు టాక్. సరైన అనుమతులు లేకుండా, అనధికారికంగా ఈ సీక్వెల్‌ను తెరకెక్కించారంటూ ఫాంటమ్ స్టూడియోస్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఫాంటమ్ స్టూడియోస్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. 'క్వీన్' సినిమాకు సంబంధించిన పూర్తి ఐపీ హక్కులు తమకే ఉన్నాయని వారు వాదిస్తున్నారు. జియోస్టార్ సంస్థ తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, కనీసం హక్కులను కూడా కొనుగోలు చేయకుండా ఈ సీక్వెల్ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లిందని వారు ఆరోపించారు. అందుకే ఈ భారీ దావా వేయాల్సి వచ్చిందని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై ఇప్పటివకు జియోస్టార్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ నెట్టింట పలు పోస్టులు వైరల్ అవుతూ హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ఈ విషయంపై నెటిజన్లలో ఆసక్తి నెలకొంది. ఈ వివాదం ‘క్వీన్-2’ విడుదలపై ప్రభావం చూపే అవకాశముందా? అనే చర్చ కూడా జరుగుతోంది. అలాగే అనుకున్న సమయానికి విడుదల అవుతుందా? లేక వాయిదా పడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Next Story