నిప్పంటించుకుని చికిత్స పొందుతూ మహిళ మృతి

by Kodari Anjali |

పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మరణించింది.

నిప్పంటించుకుని చికిత్స పొందుతూ మహిళ మృతి
X

దిశ, మల్దకల్: కుటుంబ కలహాల నేపథ్యంలో మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామానికి చెందిన సుజాత సోమవారం సాయంత్రం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. ఆమె శరీరం తీవ్రంగా కాలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు‌ ఆమెను గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించగా.. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి ఆంబులెన్స్‌లో కర్నూల్ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story