యాక్షన్ డ్రామాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న అడివి శేష్!

by Mallepaka Hamsa |

అడివి శేష్ తెలుగులోనే కాకుండా హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుబోతున్నారట.

యాక్షన్ డ్రామాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న అడివి శేష్!
X

దిశ, సినిమా: కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న హీరో అడివి శేష్. ఇటీవల ‘డెకాయిట్’ చిత్రంలో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ‘గూఢచారి-2’ మూవీ పనుల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించిన ‘గూఢచారి’కి సీక్వెల్‌గా రాబోతుండటం విశేషం. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో అడివి శేష్ సరసన వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, అడివి శేష్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. అడివి శేష్ తెలుగులోనే కాకుండా హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుబోతున్నారట.

ఇందులో భాగంగానే ఆయన ఒక భారీ యాక్షన్ డ్రామా సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అత్యంత వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ డ్రామా అక్టోబర్ నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రానప్పటికీ, సినిమాకు సంబంధించిన చర్చలు గట్టిగా జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్, దీనిని తెరకెక్కించబోయే దర్శకుడి పేరు, అలాగే నిర్మాణ సంస్థ వంటి విషయాలను చిత్ర యూనిట్ చాలా సీక్రెట్‌గా ఉంచింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను భారీ ఎత్తున విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story