Breaking: తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సులు! అలిపిరి డిపో వద్ద డ్రైవర్ల ఆందోళన

by Ramesh Naini |

తిరుమలకు వెళ్లే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అలిపిరి డిపోలో డ్రైవర్లు నిలిపివేసి ఆందోళన చేపట్టారు.

Breaking: తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సులు! అలిపిరి డిపో వద్ద డ్రైవర్ల ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమలకు వెళ్లే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అలిపిరి డిపోలో డ్రైవర్లు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. ప్రతి డ్యూటీలో తప్పనిసరిగా 5 ట్రిప్పులు పూర్తి చేయాలని మేనేజ్‌మెంట్ నిబంధన పెట్టిందని నిరసన వ్యక్తం చేస్తు్న్నారు. బస్సుల బ్యాటరీ చార్జింగ్, సాంకేతిక సమస్యల కారణంగా 3 నుంచి 4 ట్రిప్పులకే పరిమితమవుతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. 5 ట్రిప్పులు పూర్తి చేయకపోతే నెలవారీ జీతానికి బదులుగా ట్రిప్పుల ఆధారంగా వేతనం చెల్లిస్తామని మేనేజ్‌మెంట్ నిర్ణయించడంతో ఆందోళనకు దిగినట్లు ఆవేదన చెందారు. ఈ పరిణామంతో తిరుమలకు బస్సు సేవలపై తాత్కాలిక ప్రభావం పడింది.

Next Story