కోరపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఇసుక మాఫియా హల్చల్.. 6 మంది అరెస్ట్

by Kodari Anjali |

జమ్మికుంట మండలం కోరపల్లి చెక్‌పోస్ట్ వద్ద గత రాత్రి అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి ఉద్రిక్తత నెలకొంది.

కోరపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఇసుక మాఫియా హల్చల్.. 6 మంది అరెస్ట్
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలం కోరపల్లి చెక్‌పోస్ట్ వద్ద గత రాత్రి అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి ఉద్రిక్తత నెలకొంది. ఇసుక మాఫియా సభ్యులు పోలీసులపై దాడికి యత్నించడంతో 6 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరపల్లి చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను ఆపారు. దీంతో ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులు తమ ట్రాక్టర్లను వదిలిపెట్టాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాట మాట పెరిగి పోలీసులపై దాడి చేయడానికి యత్నించారు. జమ్మికుంట ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. పోలీసులు తనిఖీలు చేపట్టిన ప్రతిసారి మాఫియా వ్యక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చెక్‌పోస్టుల వద్ద నిఘాను, సిబ్బందిని పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story