- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాల జిల్లాలో యథేచ్ఛగా కార్పొరేట్ దందా
కొత్త అడ్మిషన్ల పనిలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి వింత పోకడలు అవలంబిస్తున్నాయి.

దిశ, మంచిర్యాల: ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు. విద్య సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. కొత్త అడ్మిషన్ల పనిలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి వింపోకడలు అవలంబిస్తున్నాయి. వీటికి ఆదుకట్ట వేయాల్సిన అధికారులు మిన్నకుండి పోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. 2026-27 విద్య సంవత్సరానికి అడ్మిషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం మూగీకముందే అడ్మిషన్లు మొదలుపెట్టాయి. ఫీజులో రాయితీ అంటూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ నిబంధనల ఉల్లంఘన యదేచ్చగా కొనసాగుతోంది. విద్య శాఖ అధికారులు నిమ్మకు మీరెత్తినట్లు ఉండడంతో విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి.
ప్రైవేట్ పాఠశాలల అడ్మిషన్ల వేట..
మంచిర్యాల జిల్లాలో కార్పొరేటు, ప్రైవేటు పాఠశాలలు నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. నర్సరీ నుంచి పదవ తరగతి వరకు ముందస్తు అడ్మిషన్లకు తెరలేపుతూ ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. మామూలు పాఠశాల లో నర్సరీ నుండి రూ.16 వేలు, పదవ తరగతి వరకు రూ .85 వేల చొప్పున వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలలో అయితే ఏకంగా నర్సరీ నుండి రూ .25 వేలు, పదవ తరగతి వరకు రూ
2 లక్షల వరకు ఫీజులను వసూళ్లకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త పేర్లతో ప్రచార జోరును తెరపైకి తెస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలలకు పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. మొదటగా ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు ముగియడంతో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా చేసుకొని జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల పేరుతో వేట ముమ్మరం చేస్తున్నారు.
జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు..
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 237 పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేట్ లో చదువుకునే విద్యార్థుల సంఖ్య 71 వేయి 828 వరకు ఉంది. మంచిర్యాల లో 63 పాఠశాలలు ఉండగా నాలుగు మండలాలలో కలిపి 119 పాఠశాలలు ఉన్నాయి. చెన్నూరు లో 15 పాఠశాలలు ఉండగా నియోజకవర్గం నాలుగు మండలాలలో కలిపి 59 పాఠశాల లు ఉన్నాయి. బెల్లంపల్లిలో 27 పాఠశాలలు ఉండగా నియోజకవర్గం 7 మండలాలలో 46 పాఠశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో పాఠశాలలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. విద్యను వ్యాపారమే లక్ష్యంగా ప్రైవేట్ పాఠశాలల ఆగడాలు మితిమీరిపోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని అప్పర్ ప్రైమర్ పాఠశాలలో కాగా మరికొన్ని కార్పొరేట్ స్థాయి పాఠశాలలు అని చెప్పుకుంటూ అడ్మిషన్ల పేరుతో దోపిడి యదేచ్చగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
గాడిన పెట్టేది ఎవరు..
జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు చేస్తున్నప్పటికీ విద్య శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రైవేటు విద్య సంస్థల యాజమాన్యాలకు కలిసివస్తుందని తెలుస్తోంది. కొందరు బడా రాజకీయ నాయకుల ప్రోత్బలం ఉండడంతో ప్రైవేట్ పాఠశాల జోలికి వెళ్లేందుకు విద్య శాఖ అధికారులు జంకుతున్నట్లు వినిపిస్తోంది. జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో దోపిడీ జరుగుతున్న విద్యాశాఖ స్పందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. స్కూల్లలో తనిఖీలు చేయడం లేదు మరోవైపు అనుమతి లేని స్కూల్ లపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ విఫలం అవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం మూలంగా జిల్లాలో విద్యాహక్కు చట్టం నిర్వీర్యం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలల ఆగడాలను గాడిలో పెట్టాల్సిందెవరు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.






