ఆస్ట్రేలియా జట్టులో కరోనా కలకలం.. ఇద్దరు క్రికెటర్లకు పాజిటివ్

by Vinod kumar |

లాహోర్: పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా - Corona is causing a stir in the Australian team

ఆస్ట్రేలియా జట్టులో కరోనా కలకలం.. ఇద్దరు క్రికెటర్లకు పాజిటివ్
X

లాహోర్: పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఊహించని విధంగా వన్డే సిరీస్‌కు ముందు జట్టులోని కీలక ఆటగాళ్లు కొవిడ్ బారిన పడటంతో కంగారు జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆసిస్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీస్, స్పిన్నర్ అస్టన్ అగర్‌లకు వన్డే సిరీస్‌కు ముందు నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ నిర్దారణ జరగడంతో వీరిని జట్టు నుంచి తప్పించి క్వారంటైన్‌కు తరలించారు.


వీరితో పాటే క్రికెటర్ల ఫిజియోథెరపిస్ట్ బ్రెండన్ విల్‌సన్ కూడా మంగళవారం కొవిడ్ బారిన పడినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అయితే, క్వారంటైన్‌లో ఉన్న ఇంగ్లీస్ స్థానాన్ని బ్యాటర్ మాథ్యూ రెయిన్ షా తో భర్తీ చేసినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. కాగా,ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ తొలి వన్డే మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం లాహోర్ వేదికగా మంగళవారం జరిగింది.

Next Story