గుండంపల్లిలో కార్డెన్ సెర్చ్

by Batti.Sumithra |

దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి గ్రామంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.

గుండంపల్లిలో కార్డెన్ సెర్చ్
X

దిశ, దిలావర్పూర్ : దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి గ్రామంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గుండంపెల్లి గ్రామంలో సరైన పత్రాలు లేని 81 ద్విచక్ర వాహనాలు, ఆరు కార్లు, రెండు ఆటలను పోలీసులు సీజ్ చేశారు. వాహనాల పైన ఉన్న చలాన్ లను 43,390 రూపాయలను వసులు చేశారు. నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమైనటువంటి గంజాయి నిర్మూలణ గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల గురించి, గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ సాగర్, దిలావర్పూర్ ఎస్సై రవీందర్, నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి, నర్సాపూర్ ఎస్సై గణేష్, నిర్మల్ రూలర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story