- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దాశరథి అవార్డు ఎంపికకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవ్వబోయే ప్రతిష్టాత్మక శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు-2026 ఎంపిక కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవ్వబోయే ప్రతిష్టాత్మక శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు-2026 ఎంపిక కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సాహిత్యవేత్తను ఈ అవార్డుకు ఎంపిక చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు. కమిటీ చైర్మన్ గా డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ (రచయిత) సభ్యులుగా జయరాజు (కవి), డాక్టర్ యాకూబ్ (కవి), సుంకిరెడ్డి నారాయణరెడ్డి (కవి, రచయిత), నెల్లుట్ల రమాదేవి (కవి) సభ్యుడు, కన్వీనర్ గా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డిలు ఉన్నారు. ఈ కమిటీ అర్హులైన ఒక ప్రముఖ సాహితీవేత్త పేరును పరిశీలించి, తుది నిర్ణయం కోసం ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.






