గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో విక్రమ్ సినిమా.. షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఘాటీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విక్రమ్ ప్రభు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా మంచి గుర్తుంపు తెచ్చుకున్నాడు.

గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో విక్రమ్ సినిమా.. షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఘాటీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విక్రమ్ ప్రభు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా మంచి గుర్తుంపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ తమిళ హీరో తన తదుపరి సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ‘Vikram Prabhu 26’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాహుల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. తాజాగా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఈ రోజు షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలిపారు. అలాగే ఇది గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతున్నట్లు తెలుపుతూ.. రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Next Story