చల్లబడ్డ వాతావరణం.. అర్ధరాత్రి నుంచి ముసురు వాన

by Jakkula.Mamatha |

తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఈదురుగాలులు మెరుపులతో కూడిన ముసురు వాన కురుస్తుంది.

చల్లబడ్డ వాతావరణం.. అర్ధరాత్రి నుంచి ముసురు వాన
X

దిశ, మక్తల్: గత రెండు రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ జనం అకాల వర్షానికి వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఈదురుగాలులు మెరుపులతో ఓ మోస్తారు వర్షంతోపాటు ముసురు వాన కురుస్తుంది. ఈ అకాల వర్షంతో పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కానీ రైతులకు ఈ వర్షం మేలు చేసింది.

ఈ అకాల వర్షం వల్ల రైతులు యాసంగి కాలంలో సాగు చేసిన వరి పంటకు ఊరట లభించింది. ఆరుతడి పంటలుగా సాగు చేసిన వేరుశనగ, పేసర, పారం జోన్న, సన్‌ఫ్లవర్ పంటలకు చాలా మేలు చేసిందని రైతులు అంటున్నారు. అయితే పలు గ్రామాల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున సూర్యోదయ సమయం గడుస్తున్న వర్షం కురుస్తూనే ఉంది. మరికొన్ని నియోజకవర్గంలోని గ్రామాల్లో ముసురు వాన కురిసింది. కాగా కొన్ని గ్రామాల్లో రాత్రి నుంచి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Next Story