కుంభమేళా 'వైరల్ గర్ల్' పెళ్లిపై వివాదం.. ఇది 'లవ్ జిహాద్' అంటూ దర్శకుడి సంచలన ఆరోపణ!

by Malleboina Mahesh |   (  Updated:2026-03-16 06:43:45  IST  )

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో గుర్తింపు పొందిన మోనాలీసా భోంస్లే వివాహంపై వివాదం. ఇది 'లవ్ జిహాద్' అంటూ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆరోపణ. మధ్యప్రదేశ్ సీఎంకు ఫిర్యాదు.

కుంభమేళా వైరల్ గర్ల్ పెళ్లిపై వివాదం.. ఇది లవ్ జిహాద్ అంటూ దర్శకుడి సంచలన ఆరోపణ!
X

దిశ, వెబ్ డెస్క్: కుంభమేళాలో వైరల్ గా మారడంతో పాటు ఇటీవల సినిమా చాన్సులు దక్కించుకుని వైరల్ గర్ల్ మోనాలిసా (Mona Lisa) పెళ్లి.. ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. దీనికి తోడు ఓ దర్శకుడు.. ఆమెది లవ్ జీహాద్ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివరాల్లోకి వెళితే.. గతేడాది ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన యువతి మోనాలీసా భోంస్లే వివాహం ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. మోనాలీసా ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడంపై చిత్ర దర్శకుడు సనోజ్ మిశ్రా (Director Sanoj Mishra) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం ఖర్గోన్‌లో మోనాలీసా కుటుంబాన్ని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పెళ్లి వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఇది స్పష్టంగా 'లవ్ జిహాద్' ('Love Jihad') అని ఆరోపించారు. హిందూ మహిళలను ప్రలోభపెట్టి మతమార్పిడి చేయడమే లక్ష్యంగా ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ (Chief Minister Mohan Yadav)ను కలిసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తానని సనోజ్ మిశ్రా వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కుంభమేళాలో ఆధ్యాత్మిక గుర్తింపు పొందిన యువతి ఇలాంటి వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు హిందూ సంఘాలు కూడా ఈ వివాహం పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దర్శకుడి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.

ఇలా మీ ముందుకు వస్తానని అనుకోలేదు.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ

Next Story