ఇలా మీ ముందుకు వస్తానని అనుకోలేదు.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ

by Mallepaka Hamsa |

ఇలా గాయాలతో మీ ముందుకు వస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ముఖానికి దెబ్బ తగలడంతో చాలా నొప్పిగా ఉంది.

ఇలా మీ ముందుకు వస్తానని అనుకోలేదు..  ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్ 7 ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అశ్విని శ్రీ ప్రమాదానికి గురయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి అడుగుపెట్టి తనదైన ఆటతీరుతో పాపులారిటీ సంపాదించుకున్న ఆమె, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, తాజాగా ఆమె షేర్ చేసిన ఒక ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అశ్విని శ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె ముఖానికి గాయాలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అసలేం జరిగిందంటే.. ఉదయాన్నే తన పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆమె కింద పడిపోయారట. ఆ సమయంలో ముఖం నేలకు బలంగా తగలడంతో తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు.

"ఇలా గాయాలతో మీ ముందుకు వస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ముఖానికి దెబ్బ తగలడంతో చాలా నొప్పిగా ఉంది. నా బాధను వర్ణించలేకపోతున్నాను" అంటూ అశ్విని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని, తన కోసం అందరూ ప్రార్థించాలని ఆమె కోరారు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న నటికి ముఖానికి గాయాలవ్వడం కెరీర్ పరంగా కూడా ఆందోళన కలిగించే విషయమే. ఇక అశ్విని శ్రీ షేర్ చేసిన ఈ వీడియో చూసి అభిమానులు నెటిజన్లు షాక్ అవుతున్నారు. "త్వరగా కోలుకోండి అశ్విని గారు.. ధైర్యంగా ఉండండి" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం మైండ్ దొబ్బిందా? అని అంటున్నారు.. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో బిజీ అవుతున్న సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని ఆమె ఫాలోవర్లు భావిస్తున్నారు.

Next Story