- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medaram Jatara : మేడారంలో నిరంతరం ఆర్టీసీ సేవలు.. అందుబాటులో 4 వేల బస్సులు
మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను సురక్షితంగా తల్లుల చెంతకు చేర్చడం కోసం ఆర్టీసీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

దిశ, మేడారం నెట్‌వర్క్: మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను సురక్షితంగా తల్లుల చెంతకు చేర్చడం కోసం ఆర్టీసీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీదేవి తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల వరకు రెండు లక్షల తొంభై వేల మంది భక్తులను మేడారానికి తరలించినట్లు తెలుస్తోంది. 6400 ట్రిప్పులు జరిగినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 51 పాయింట్స్ నుండి మేడారానికి బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.
భక్తులకు సరైన సమయంలో, సౌకర్యంగా తల్లుల సేవలు అందేలా చేసేందుకు 4 వేల బస్సులు అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు. తమ సిబ్బంది ఎల్లవేళలా మేడారం భక్తులకు అసౌకర్యం కలగకుండా పని చేస్తున్నట్లు తెలిపారు. టెంట్లు, వాటర్ సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యం సహా.. టికెట్స్ తీసుకునే దగ్గర ఇబ్బందులు తలెత్తకుండా బ్యారికెట్ లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.






