ఓలా సంస్థకు వినియోగదారుల కమిషన్ షాక్.. భారీ జరిమానా

by Malleboina Mahesh |

వాహనంలో లోపాలను సరిచేయడంలో విఫలమైన ఓలా సంస్థకు వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. వాహనం ధరతో పాటు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఓలా సంస్థకు వినియోగదారుల కమిషన్ షాక్.. భారీ జరిమానా
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వినియోగదారుడు కొనుగోలు చేసిన కొత్త వాహనంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో వాటిని పరిష్కరించడంలో సంస్థ నిర్లక్ష్యం వహించడంతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని నల్లగండ్లకు చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యక్తి 2023 నవంబర్ 9న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. అయితే కొన్నప్పటి నుంచే వాహనంలో తరచూ సమస్యలు వస్తుండటంతో ఆయన పలుమార్లు సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించారు. ఎన్నిసార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసిగిపోయిన బాధితుడు వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

కమిషన్ తీర్పు

ఫిర్యాదుదారుడి తరపు వాదనలను విన్న వినియోగదారుల కమిషన్, ఓలా సంస్థ సేవల్లో లోపం ఉందని నిర్ధారించింది. బాధితుడికి జరిగిన నష్టానికి గానూ వాహనం ధర రూ. 1,19,999 వెనక్కి ఇవ్వాలి. ఇన్సూరెన్స్ మొత్తం రూ. 7,243 చెల్లించాలి. కేసు ఖర్చులు రూ. 5,000 అందించాలి. మానసిక వేదనకు గానూ మరో రూ. 5,000 చెల్లించాలని కమిషన్ జరిమానా విధించింది. దీంతో ఎంత పెద్ద సంస్థ అయినా.. వినియోగదారుల హక్కులను కాలరాస్తే భారీ మూల్యం తప్పదని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది.

Next Story