- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి భారత్ బంద్ కు కాంగ్రెస్ మద్దతు
పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఏఐసీసీ పిలుపు

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక సంస్కరణలు, కార్మికుల రక్షణలను బలహీనపరిచే ఆర్ధిక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. దీనికి నిరసనగా కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక, వివిధ రైతు సంఘాలు నేడు భారత్ బంద్ కి పిలుపును ఇచ్చాయి. ఈ భారత్ బంద్ కి జాతీయ కాంగ్రెస్ మద్దతు పలికింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. కొత్త కార్మిక కోడ్ లు ఉద్యోగ భద్రతను తగ్గించాయని, రక్షణలను నీరు గార్చాయన్నారు. నియామకం మరియు తొలగింపుల్లో యజమాని పరిధి పెరిగిందని, దీనితో కార్మికుల హక్కులు, ప్రయోజనాలకు ప్రతికూల పరిస్థితి ఏర్పడిందని కేసీ వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారత్ బంద్ కి అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు పూర్తి సంఘీభావం ప్రకటించాలని, కార్మికులు, రైతులు చేసే ప్రజాస్వామ్య పోరాటంలో వారికి అండగా నిలవాలని ఆయన సూచించారు.






