- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యక్రమాలు.. మీనాక్షి నటరాజన్ హాజరు
జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మాగాంధీ పేరును తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నిరసనలు తీవ్రం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మాగాంధీ పేరును తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నిరసనలు తీవ్రం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణలో ఈనెల 28 నుంచి 31 వరకూ నియోజకవర్గాల వారీగా ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు హోల్డర్లతో గ్రామ సభలను నిర్వహించనున్నది. ఈ కార్యక్రమాల్లో పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్మహేష్కుమార్ గౌడ్‌లు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నియోజకవర్గాల పర్యటనల్లో డీసీసీ అధ్యక్షులు, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. 28న మెదక్ నియోజకవర్గం, మానకొండూరు 29న వేముల వాడ, ఎల్లారెడ్డి 30న మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుంటారు. ఆ సాయంత్రం ఆలేరు నియోజక వర్గంలో గ్రామ సభలో పాల్గొననున్నారు. 31న నకిరేకల్, ఇబ్రహీంపట్నం నియోజక వర్గాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ నేతలు మాట్లాడనున్నారు. నియోజకవర్గాల్లోని గ్రామ సభల్లో ఉదయం ఒక గ్రామంలో సాయంత్రం ఒక గ్రామంలో నిర్వహిస్తారు. గ్రామ సభల్లో ఈ జాతీయ ఉపాథి హామీ పథకంపై కేంద్రం అవలంభిస్తున్న విధానాలు, కొత్త పథకం తీరు తెన్నులను జాబ్ కార్డు హోల్డర్లకు వివరిస్తారని పార్టీ నేతలు తెలిపారు. జాతీయ ఉపాధి చట్టం జాబ్ కార్డ్ హోల్డర్లతో సమావేశంతో పాటు వారితో కాంగ్రెస్ నేతలు సహా పంక్తి భోజనం కూడా చేయనున్నారు.





