- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ఖాతాలో మంచిర్యాల కార్పొరేషన్
అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పాటు కార్పొరేషన్ ఫలితాల్లో సత్తా చాటుతోంది. మంచిర్యాల్ కార్పొరేషన్ లో 50కి పైగా డివిజన్లలో గెలిచి భారీ విజయాన్ని అందుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఈ నెల 11న జరిగిన 7 కార్పొరేషన్లలో అధికార పార్టీ హవా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వెలువడిన ఫలితాల్లో మంచిర్యాల కార్పొరేషన్ లో భారీ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 50 డివిజన్లలో విజయం సాధించింది. అలాగే మరో ఆరు డివిజన్లకు కౌంటింగ్ కొనసాగుతుండగా.. మరో 4 డివిజన్లలో బీఆర్ఎస్ విజయం సాధించింది. మిగిలిన నాలుగు డివిజన్లలో.. మూడింట్లో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనుకున్న బీజేపీ.. కనీసం పోటీలో కూడా లేకుండా పోయింది. ఇప్పటి వరకు కమలం పార్టీ ఖాతా కూడా తెరవలేక పోవడంతో అంతా ఆశ్చర్యపోయారు.
Next Story






