'గాంధీ కుటుంబ బానిసత్వంలోనే కాంగ్రెస్ పార్టీ'

by Hajipasha |

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Latest Telugu News

గాంధీ కుటుంబ బానిసత్వంలోనే కాంగ్రెస్ పార్టీ
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా గాంధీ కుటుంబం బానిసత్వంలోనే ఉందని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని ఈడీ విచారణను కాంగ్రెస్ నేతల ప్రశ్నలపై ఆయన విరుచుకపడ్డారు. పార్టీ కీలక నేతలు గాంధీ కుటుంబం ఏమి చేయనప్పుడు దర్యాప్తుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 'వేల కోట్ల ఆస్తిని ఎలా దోచుకోవాలో చెప్పడానికి నేషనల్ హెరాల్డ్ కేసు అతిపెద్ద ఉదాహరణ. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్నారు.

బెయిల్‌పై బయటకు వచ్చినా విచారణ నుంచి ఎందుకు పారిపోతున్నారు? తమ పార్టీ చేసిన అవినీతిని దాచిపెట్టడానికి, విచారణ ఆపడానికి కాంగ్రెస్ నేతల మొసలి కన్నీరు కారుస్తున్నారు. కాంగ్రెస్ దర్యాప్తు సంస్థల పరిధి దాటిందా? కాంగ్రెస్ నేతలకు దేశంలోని చట్టం వర్తించదా? గాంధీ కుటుంబం దేశ చట్టానికి మినహాయింపా? స్కామ్ ఎందుకు జరిగిందో దర్యాప్తు సంస్థకు చెప్పలేదా? వాళ్లు అమాయకులైతే ఎందుకు భయపడతారు?' అంటూ ఠాకూర్ మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకా గాంధీ కుటుంబం బానిసత్వంలోనే ఉందని విమర్శించారు.

Next Story