- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవిని కలిసిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు
by Batti.Sumithra |
సోమవారం టేకులపల్లి నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవిని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు.

X
దిశ, టేకులపల్లి : సోమవారం టేకులపల్లి నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవిని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్ సమక్షంలో సర్పంచులను నూతన ఎంపీడీవో శ్రీదేవికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు శాలువాతో ఎంపీడీవో శ్రీదేవిని ఘనంగా సన్మానించారు. గ్రామాల అభివృద్ధి, పారిశుధ్యం, స్థానిక పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలందింపు అంశాలపై సర్పంచులకు ఎంపీడీవో శ్రీదేవి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, పోశాలు, భద్రు, సుధాకర్, నగేష్, సుఖ్య, బన్సీలాల్, కోటి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






