- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కేసీఆర్ స్థానంపై హరీష్ రావు కన్ను’.. కాంగ్రెస్ MP హాట్ కామెంట్స్
హరీష్ రావుపై కాంగ్రెస్ ఎంపీ హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం చామల కిరణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లారు. ‘మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల విత్‌డ్రా ప్రక్రియ ఈరోజుతో ముగియనున్నది. దయచేసి ఎవరూ బీఆర్ఎస్‌కు ఓటు వేయకండి. ఆ పార్టీకి ఓటు వేసి ప్రయోజనం లేదు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. కేసీఆర్ తెలంగాణకు జాతిపిత అంటూ కేటీఆర్ పిట్టకథలు చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే పిత అని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.
హరీష్ రావు కడుపు మండుతోంది
‘హరీష్ రావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకుండానే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అందుకే ఆయన్ను అందరూ లక్కీ స్టార్ అంటారు. కవిత మాత్రం గుంట నక్క అంటోంది. కేసీఆర్ తర్వాత.. ఆ స్థానంపై హరీష్ రావు కన్నేశారని కవిత చెబుతూ వస్తోంది. రేవంత్ రెడ్డి ఎవరి సహాయం లేకుండానే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. అందుకే హరీష్ రావు కడుపు మండుతోంది. ఆయన కడుపు మంటను తగ్గించాలనే ENO ప్యాకెట్ పంపించాను. ఇకనైనా హరీష్ రావు పిచ్చి మాటలు, పిట్ట కథలు చెప్పడం బంద్ చేయాలి.
నిరుద్యోగులను ఎంతో వేధించారు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదని కేసీఆర్ బయటికి వచ్చారు. నా కుటుంబంలో ఎవరికీ పదవి ఆశ లేదని కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పారు. వచ్చిన తెలంగాణలో అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు, ఎంపీలు ఇచ్చుకున్నాడు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను ఎంతో వేధించారు. అందుకే సమయం వచ్చినప్పుడల్లా ప్రజలు బీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతూనే ఉన్నారు. గద్దర్‌ను గేటు బయట ఎండలో నిల్చోబెట్టారు. ఉద్యమం నుంచి కేసీఆర్ వెంట ఉన్న ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి గెంటేశారు. ఇప్పుడు సొంత కూతురును కూడా రోడ్డున పడేశారు. ఇలాంటి వాళ్లు రాష్ట్రాన్ని ఏం పట్టిచుకుంటారు’ అని చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.






