- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిట్ విచారణకు CM రేవంత్‌కి ఎలాంటి సంబంధం లేదు: MLC
కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని మాట్లాడుతున్నారు. సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో లబ్ధి పొందిన వాళ్లను సిట్ విచారణకు పిలుస్తోంది. ట్యాపింగ్ వల్ల అత్యధికంగా లబ్ధి పొందింది కేసీఆర్..అందుకే విచారణకు పిలిచారని ఎమ్మెల్సీ వెంకట్ తెలిపారు. గురువారం బల్మూర్ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు అంటే కేసీఆర్ జాతిపిత అయిపోరని, కేసీఆర్ చరిత్ర సృష్టించాడా లేక చరిత్ర హీనుడా అన్నది తెలంగాణ ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టింది..ఉసురు పోసుకున్నది ఎవరన్నది అందరికీ తెలుసు..చట్టానికి అందరూ సమానమే.. సిట్ విచారణకు పిలువకూడదు..అతీతుడు అన్నట్లుగా మాట్లాడుతున్నారు..మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ నాయకులు నీచ ప్రచారం చేసుకుంటున్నారని బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. డ్రామారావు, హరీష్ రావు చిల్లర రాజకీయాలు ఆపాలి..కేసీఆర్ విచారణకు హాజరై నిజాయితీ నిరూపించుకోవాలి..మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం నేర్పిస్తారని బల్మూర్ వెంకట్ విమర్శలు గుప్పించారు.






