- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ ఆస్తుల(KCR Family Assets)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు.. వచ్చాక కేసీఆర్ ఆస్తుల వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని నిలువునా దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్ తీరును తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. జిల్లాలను రద్దు చేస్తామని ఎవరూ చెప్పలేదు.. తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నేతల పని అని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా రెండేళ్లలోనే అనేక హామీలు నెరవేర్చామని అన్నారు. మహిళలకు ఉచితబస్సు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, 60 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు భరోసా, రైతుభరోసా ఇలా చెప్పుకుంటూ పోతే అనే హామీలు అమలు చేశామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఎంత మంచిపని చేసినా విమర్శించడమే పనిగా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారని నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.






