కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

by Batti.Sumithra |

సదాశివనగర్ మండలం తిమ్మాజివాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం కామారెడ్డిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
X

దిశ, సదాశివనగర్ : సదాశివనగర్ మండలం తిమ్మాజివాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం కామారెడ్డిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తిమ్మాజివాడి గ్రామానికి చెందిన ఎర్రం రాజశేఖర్, మల్లయ్య, భిక్షపతి, సంతోష్, స్వామి తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేరిన నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలైన ప్రజాసంక్షేమ పథకాల పై నమ్మకంతోనే తాము బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపై ఆయన నాయకత్వంలోనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story