- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్, కేటీఆర్‌ను ఇరికించిన హరీష్ రావు.. విచారణలో ఏం జరిగిందంటే?: రామ్మోహన్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ ఇవాళ బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావును సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ ఇవాళ బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావును సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. తానే సిట్ అధికారులకు వంద ప్రశ్నలు వేశానని హరీష్ రావు చేసిన కామెంట్స్‌కు టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వ్యంగంగా పోస్టు పెట్టారు. ‘‘నన్నే ఎందుకు పిలుస్తున్నారు.. వారిని(కేసీఆర్, కేటీఆర్‌ను ఉద్దేశించి) కూడా పిలవండి’’ అని హరీష్ రావు సిట్ అధికారులకు సూచించినట్లు రామ్మోహన్ రెడ్డి సెటైర్ వేశారు.
‘‘ఫోన్ ట్యాపింగ్ విచారణలో సిట్ ముందు హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు పోలీసులనే ప్రశ్నలు అడిగానని చెప్పుకోవడం కొంత వరకు కరెక్టే కావచ్చు. ఆయన పోలీసులను అడిగింది.. నన్నే విచారణకు ఎందుకు పిలుస్తున్నారు?. పెద్దాయనను, అప్పట్లో సకల శాఖాల మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ఎందుకు విచారణకు పిలవలేదు. అసలు కవితతో పాటు నా ఫోన్లు కూడా వారు విన్నారని నాకూ బయటికి చెప్పుకోలేని బాధ ఉంది. మీరు దయచేసి తండ్రి కొడుకులని కూడా పిలిచి విచారించి నిజాలు తేల్చాలి’’ అని సిట్ అధికారుల ఎదుట హరీష్ రావు వాపోయారని సామ రామ్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.






