- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anand Sharma: బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ?
Congress leader Anand Sharma to join BJP? Clarifies After JP Nadda meeting| రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీని గద్దెదింపి కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని భావిస్తున్న హస్తం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా? ఆ పార్టీ సీనియర్ నేత, జీ23 టీమ్ లీడర్లలో ఒకరైన

దిశ, వెబ్‌డెస్క్: Congress leader Anand Sharma to join BJP? Clarifies After JP Nadda meeting| రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీని గద్దెదింపి కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని భావిస్తున్న హస్తం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా? ఆ పార్టీ సీనియర్ నేత, జీ23 టీమ్ లీడర్లలో ఒకరైన ఆనంద్ శర్మ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జేపీ నడ్డాతో గురువారం సాయంత్రం ఆనంద్ శర్మ సమావేశం కావడం కాంగ్రెస్ శ్రేణులను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఆయన గతంలో పార్టీ అధిష్టానంపై అసమ్మతి గళం వినిపిస్తున్న వారి బృందంలో ముఖ్యమైన వ్యక్తి కావడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధం అయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మరో నాలుగు నెలల్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి మధ్య భేటీ జరగడం రాజకీయంగా సంచలనం వుతోంది. అయితే తన భేటీపై ఆనంద్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం అన్నారంటే..
'తాను బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలిస్తే తప్పేంటి? అతనిని కలిసే హక్కు నాకు ఉంది. నాకు ఆయన అధ్యక్షుడు కాదు(బీజేపీకి అధ్యక్షుడు). మేమిద్దరం ఒకే రాష్ట్రం నుండి వచ్చాం. ఆయన్ను కలవాల్సి వస్తే బహిరంగంగా వెళతాను. ఇందులో పెద్ద విశేషం ఏముంది? నేను కాంగ్రెస్‌కు చెందినవాడిని. సైద్ధాంతిక ప్రత్యర్థులుగా ఉండటం అంటే మా మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని అర్థం కాదు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు' అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆనంద్ శర్మ వివరణ ఇలా ఉన్నప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఆయన వ్యవహార తీరును బట్టి చూస్తే త్వరలో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కమిటీ జీ -23లో కీలకమైన సభ్యుడిగా ఉన్న ఆనంద్ శర్మ, పార్టీ నాయకత్వంపై తన అసంతృప్తిని అనేక సార్లు బహిరంగంగానే వ్యక్తం చేశారు. పైకి చెప్పకున్నా తాజా భేటీలో వీరి మధ్య హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలపై చర్చ జరిగినందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆనంద్ శర్మ హిమాలచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీకి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఆ రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరగున్న నేపథ్యంలో వీరి భేటీతో సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. జరుగుతున్న ప్రకారం ఆనంద్ శర్మ కాంగ్రెస్ కు 'హ్యాండ్' ఇస్తే రాహుల్ గాంధీని పీఎంగా చూడాలనుకుంటున్న ఆ పార్టీ శ్రేణుల ప్రయత్నానికి బిగ్ షాక్ కానుంది.
- Tags
- Anand Sharma






