కేరళలో విజయోత్సలకు సిద్ధం అవుతున్న కాంగ్రెస్.. భారీ విందుకు ఏర్పాట్లు

by Muthe.Rajitha |

కేరళలో సుదీర్ఘ కాలం తర్వాత అధికారం దక్కుతుందని ఆశిస్తున్న యూడీఎఫ్ భారీ ఎత్తున విజయోత్సవాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

కేరళలో విజయోత్సలకు సిద్ధం అవుతున్న కాంగ్రెస్.. భారీ విందుకు ఏర్పాట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. కేరళ, అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం పార్టీలు సంబరాలకు సిద్ధం అవుతున్నాయి. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేరళలో సుదీర్ఘ కాలం తర్వాత అధికారం దక్కుతుందని ఆశిస్తున్న యూడీఎఫ్(UDF) అప్పుడే భారీ ఎత్తున విజయోత్సవాలకు, విందులకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కేరళలోని మలప్పురం జిల్లా పాండిక్కడ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ శ్రేణులు తమ విజయం తథ్యమని భావిస్తున్న కార్యకర్తలు సుమారు 5,000 మందికి సరిపడా బిర్యానీని వండించేందుకు సిద్ధమయ్యారు.

ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా సాగుతున్న ఎల్డీఎఫ్(LDF) పాలనకు ఈ ఎన్నికలతో తెరపడుతుందని, అందుకే ఈ ఉత్సవాలను చిరస్మరణీయంగా నిర్వహించాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ సంబరాలకు రాజకీయ ప్రత్యర్థులైన సీపీఎం కార్యకర్తలను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పడం గమనార్హం. మలప్పురం జిల్లా ఎప్పుడూ యూడీఎఫ్‌కు కంచుకోటగా ఉందని, సోమవారం వెలువడే ఫలితాలు ఆ నమ్మకాన్ని నిజం చేస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story