- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు భరోసా దరఖాస్తులపై అయోమయం.. దౌల్తాబాద్ రైతుల ఆందోళన!
రైతు భరోసా దరఖాస్తుల గడువు రేపటి(జులై 5)తో ముగియనున్న నేపథ్యంలో దౌల్తాబాద్ మండల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, దౌల్తాబాద్: రైతు భరోసా దరఖాస్తుల గడువు రేపటి(జులై 5)తో ముగియనున్న నేపథ్యంలో దౌల్తాబాద్ మండల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలి? ఎక్కడ సమర్పించాలి? అనే విషయాలపై స్పష్టత లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో దౌల్తాబాద్, ముబారస్పూర్ సహా మొత్తం నాలుగు క్లస్టర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇద్దరు వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని రైతులు చెబుతున్నారు. మిగతా రెండు క్లస్టర్లకు బాధ్యత వహించే అధికారులు లేకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతు భరోసా దరఖాస్తుల గడువు సమీపిస్తుండటంతో వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించేందుకు రైతులు పలుమార్లు ప్రయత్నిస్తున్నా, వ్యవసాయ అధికారి ఫోన్‌కు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు, రైతు భరోసా దరఖాస్తుల విషయంలోనూ స్పష్టత లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఖాళీగా ఉన్న క్లస్టర్లకు అధికారులను నియమించి, దరఖాస్తుల స్వీకరణ పై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.






