మిడిల్ ఈస్ట్ దేశాల్లో తెలంగాణ కార్మికుల భద్రతపై ఎన్‌హెచ్ఆర్సీలో ఫిర్యాదు

by Muthe.Rajitha |

మిడిల్ ఈస్ట్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ కార్మికుల భద్రతపై ఎన్‌హెచ్ఆర్సీలో ఫిర్యాదు నమోదైంది.

మిడిల్ ఈస్ట్ దేశాల్లో తెలంగాణ కార్మికుల భద్రతపై ఎన్‌హెచ్ఆర్సీలో ఫిర్యాదు
X

దిశ, తెలంగాన బ్యూరో : మధ్యప్రాచ్యంలో చిక్కుకున్న తెలంగాణ కార్మికుల రక్షణ కోసం జాతీయ మానవ హక్కుల కమిషనర్ ( ఎన్‌హెచ్ఆర్సీ) లో శుక్రవారం ఫిర్యాదు నమోదైంది. దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, ఒమాన్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ కార్మికుల రక్షణకు కొరుతూ అడ్వకేట్ ఇమ్మనేని రామారావు ఎన్‌హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు. కార్మికుల వేతనాలు, పరిహారం, జీవన ఖర్చుల కోసం ప్రభుత్వ జోక్యం చేసుకోవాలని పిటిషన్లో పేర్కోన్నారు. హైదరాబాద్ ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్‌కు దిశానిర్దేశం ఇవ్వాలని కొరారు. పిటిషన్ పరిశీలించిన ఎన్‌హెచ్ఆర్సీ కేసు నమోదు చేసిందని పిటిషనర్ వెల్లడించారు.

Next Story