హద్దు తేలితేనే పరిహారం.. క్షేత్రస్థాయిలో జాయింట్ సర్వే!

by Jakkula.Mamatha |

డోర్నకల్–భద్రాచలం రెండో రైల్వే మార్గం నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతుల సమస్య పరిష్కారానికి రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.

హద్దు తేలితేనే పరిహారం.. క్షేత్రస్థాయిలో జాయింట్ సర్వే!
X

దిశ, కారేపల్లి: డోర్నకల్–భద్రాచలం రెండో రైల్వే మార్గం నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతుల సమస్య పరిష్కారానికి రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. మండల పరిధిలోని గాదెపాడు–కోమట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రెవెన్యూ 67వ సర్వే నంబర్‌లో సుమారు ఎకరం 30 గుంటల భూమికి సంబంధించిన వివాదం పై ప్రత్యేక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(భూసేకరణ)సదానందన్, మండల రెవెన్యూ అధికారి ఓరుగంటి వెంకటేశ్వర్లు, రెవెన్యూ పరిశీలకుడు, అటవీశాఖ ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్, రైల్వే శాఖ ఇంజినీర్లు, గాదెపాడు సర్పంచ్ రంజిత్ కుమార్‌తో పాటు భూ నిర్వాసిత రైతులు సంయుక్తంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా 67వ సర్వేనెంబర్ లోని భూమి రిజర్వ్ అటవీ ప్రాంతం పరిధిలోకి వస్తుందని అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రెవెన్యూ,అటవీ శాఖలు హద్దులను మరోసారి సంయుక్తంగా నిర్ధారించి సంబంధిత రికార్డులు పరిశీలించాలని నిర్ణయించాయి. రికార్డుల ఆధారంగా నిబంధనల మేరకు భూమికి పరిహారం చెల్లించే అంశంపై త్వరలో స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు హామీ ఇచ్చారు. భూ నిర్వాసిత రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు సమస్యను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని గాదెపాడు సర్పంచ్ రంజిత్ కుమార్ రైతులకు భరోసా ఇచ్చారు.

Next Story